వరంగల్ పర్యటన: మంద బాబురావు భౌతికకాయానికి కొండా సురేఖ నివాళి

రిపోర్టర్: సునీల్ స్థలం: వరంగల్

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతురాజుపల్లి మాజీ సర్పంచ్ మంద బాబురావు అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ మంత్రి కొండా సురేఖ వారి భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఓదార్చారు. బాబురావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ, వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై స్థానిక నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.