ఐజీఓటీ యోగి వేదికతో లక్షలాది మందికి కొత్త నైపుణ్యాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎల్లప్పుడూ మెరుగుపరుచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్త సాంకేతికతలు, వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు మిషన్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఐజీఓటీ యోగి ప్లాట్‌ఫారమ్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.70 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములయ్యారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.