రైలు దిగి ఆచూకీ లేకుండాపోయిన యువకుడు: ఆమదాలవలస జీఆర్పీలో మిస్సింగ్ కేసు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆమదాలవలస

శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైనట్లు హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రావు వెల్లడించారు. ఈనెల 8న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో బరహంపూర్ వెళ్లాల్సిన సాహిన్ చౌదరి (26), ఆమదాలవలస స్టేషన్లో దిగి తన సోదరుడికి చివరిసారిగా ఫోన్ చేసి మాట్లాడాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 158/2026 తో కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.