స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని వైఎస్సార్సీపీ శ్రేణులకు కాకాణి పిలుపు

రిపోర్టర్: sujith reddy స్థలం: తోటపల్లిగూడూరు

తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో నిర్వహించిన వైఎస్సార్సీపీ మండల స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని శ్రేణులను ఉత్సాహపరిచారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే ఎన్నికలను బహిష్కరించే డ్రామాలు ఆడుతున్నారని కాకాణి ఘాటుగా విమర్శించారు. కార్యకర్తలంతా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.