సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని క్షమించాలన్న తైమూర్

రిపోర్టర్: మహేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 2025లో జరిగిన కత్తిపోట్ల దాడి ఘటనలో ఆయన కుమారుడు తైమూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబైలోని బాంద్రా నివాసంలో జరిగిన ఈ దాడిలో నిందితుడిని క్షమించాలని తైమూర్ తన తండ్రిని కోరినట్లు కరీనా కపూర్ ఖాన్ తెలిపారు. నిందితుడి తల్లి శస్త్రచికిత్స కోసం డబ్బు అవసరమై ఈ దారుణానికి పాల్పడ్డానని చెప్పడంతో, తైమూర్ చలించిపోయి క్షమించమని కోరినట్లు కరీనా వెల్లడించారు.