వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి: రాజాపేట సబ్స్టేషన్ ఎదుట సిపిఐ ధర్నా

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అవాంతరాలు లేని నాణ్యమైన విద్యుత్ను కనీసం 16 గంటల పాటు వ్యవసాయానికి అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఈకి వినతిపత్రం అందజేసి ఆందోళనను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.