ఆమనగల్లులో స్పందించిన ప్రజావాణి.. మొత్తం 7 వినతులు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 7 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

అందిన ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 4, ఇందిరమ్మ ఇళ్లు 1, మున్సిపాలిటీ 1, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 1 వినతి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.