తీవ్ర అలర్ట్: తెలంగాణలో రానున్న రోజుల్లో పొడి వాతావరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం తీవ్రంగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ బులిటెన్ విడుదల చేస్తూ, ఈ నెల పదవ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. అయితే రైతాంగం వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన వ్యవసాయ పనులను చేపట్టాలని అధికారులు సూచించారు.