నెల్లూరు జిల్లాలో రైలు మార్గాలు మృత్యుమార్గ మారుతున్న వైనం

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలోని రైలు మార్గాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యం, అవగాహన లోపం కారణంగా తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మనుబోలు, గూడూరు, నెల్లూరు రైల్వే స్టేషన్ల పరిధిలో రోజూ ఎక్కడో ఒకచోట దుర్ఘటనలు జరుగుతుండగా, నెలకు సగటున ఆరుగురు మృత్యువాత పడుతున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారే బలవుతున్నట్లు జీఆర్పీ ఎస్సై హరిచందన తెలిపారు.