బీచ్‌శాండ్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు కోనసీమలో భూములు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కోనసీమ
శ్రీకాకుళం నుంచి భీమిలిపట్నం వరకు చేపడుతున్న బీచ్‌శాండ్ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మసమేధ్యం గ్రామంలోని 1,618.26 ఎకరాల భూమిని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వెల్లడించారు. ప్రాజెక్ట్ నిమిత్తం సేకరిస్తున్న అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా ఈ భూమిని ఎకరా రూ.3.75 లక్షల చొప్పున కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.