గౌహతి హోటల్ కాల్పుల నిందితుడు ఎన్కౌంటర్: పోలీసుల కాల్పుల్ లో ఘనకాంత గోగోయ్ హతం

రిపోర్టర్: అశోక్ స్థలం: Guwahati

గౌహతిలోని బిలాస్ ఇన్ హోటల్ లో ఐదుగురిని కాల్చి చంపిన ప్రధాన నిందితుడు ఘనకాంత గోగోయ్ పోలీసుల ఎదురుకాల్పుల్ లో హతమయ్యాడని అస్సాం పోలీసులు వెల్లడించారు. గౌహతి నుంచి శివసాగర్ కు తరలిస్తుండగా రోంగ్మోన్ ధాబా సమీపంలో పోలీసులపై దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్ఎస్పి పాపోరి చెటియా తెలిపారు. ఈ ఘటనలో పోలీసు అధికారి కూడా గాయపడినట్లు అధికారులు స్పష్టం చేశారు.