దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ విమానంలో కెప్టెన్‌పై కోపైలట్ కత్తితో దాడి
రిపోర్టర్: శివ
స్థలం: దుబాయ్
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానంలో గగనతలంలో ఉండగా కెప్టెన్‌పై కో-పైలట్ కత్తితో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ భారతీయుడని సమాచారం. కాక్‌పిట్‌లో జరిగిన ఈ ఘర్షణ సమయంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఇద్దరు పైలట్లు, ప్రయాణికులు కో-పైలట్‌ను అడ్డుకుని విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేశారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.