పెదపూడిలో మోటార్ సైకిల్ డిక్కీ నగదు అపహరణ కేసు ఛేదన
రిపోర్టర్: శివ
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెదపూడి పోలీసులు మోటార్ సైకిల్ డిక్కీలో నగదు అపహరణ కేసును విజయవంతంగా ఛేదించారు. సీసీ కెమెరా టేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి అపహరించిన రూ.37,000 నగదును స్వాధీనం చేసుకుని, కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.