తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత పవిత్రమైన చక్రస్నాన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహంతో శ్రీవారి పుష్కరిణి ఆధ్యాత్మిక శోభతో పులకించింది. బ్రహ్మోత్సవాలకు ఈ వేడుకతో పరిపూర్ణత చేకూరింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.