రాష్ట్రంలో ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఏడుగురు యువ ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వెల్లడించారు. 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన అధికారులను వివిధ ప్రాంతాల్లో డీఎఫ్‌వోలుగా నియమించారు. అలాగే 2024 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు అధికారులకు సబ్ డీఎఫ్‌వోలుగా పోస్టింగ్‌లు ఖరారు చేశారు. సింగూరు కృష్ణచైతన్యను ఆర్వీనగర్కు, హెచ్వీ చిదానందను కోడూరు డివిజన్‌కు కేటాయించినట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.