పుత్తూరు ఓవర్ బ్రిడ్జి కింద గుంతలతో వాహనాల రాకపోకలకు తీవ్ర అవస్థలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
తిరుపతి జిల్లా పుత్తూరు హైవేలో ఓవర్ బ్రిడ్జి కింద తారు రోడ్డు గుంతలమయంగా మారింది. రాత్రి సమయంలో టూ వీలర్లు, ఆటోలు గుంతలు తప్పించబోయి కింద పడిపోతున్నాయి. సాయంత్రం వేళల్లో వర్షాల వల్ల గుంతల్లో నీరు చేరి రోడ్డు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ తీవ్ర సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.