నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆర్థిక మార్పులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
అక్టోబర్ నెల మొదటి తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయని ఎస్బీఐతో పాటు వివిధ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఎస్బీఐ శాలరీ ఖాతాదారుల ఏటీఎం ఫ్రీ ట్రాన్సక్షన్స్ కోతతో పాటు ఎల్పీజీ ఇ-కేవైసీ, ఆర్బీఐ కొత్త బల్క్ డిపాజిట్ నిబంధనలు మారాయని అధికారులు తెలిపారు. ఈ తాజా మార్పులు సామాన్యుల రోజువారీ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.