సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఖుదీమీ మసీదు తొలగింపు తప్పనిసరి

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలోని కృషి భవన్ ఆవరణలో ఉన్న చారిత్రక ఖుదీమీ మసీదును సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా తొలగించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. కామన్ సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి ఆ స్థలం అత్యంత కీలకమని ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ద్వారా దాఖలు చేసిన నివేదికలో కేంద్రం వెల్లడించింది. ఆ ప్రాంతం ప్రభుత్వ భూమి కిందకు వస్తుందని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు అమలుకు మసీదు తొలగింపు అనివార్యమని అధికారులు పేర్కొన్నారు.