పాత్రికేయుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

పాత్రికేయుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాత్రికేయుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.