దివంగత బీఆర్ఎస్ నేత జగన్ కుటుంబానికి కొప్పుల ఈశ్వర్ ఆర్థిక సాయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ. 21.36 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న జగన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ అధిష్టానం తరఫున రూ. 10 లక్షలు, నాయకుల ద్వారా సేకరించిన రూ. 11.36 లక్షలను కుటుంబ సభ్యులకు నేరుగా అందజేసి కొప్పుల ఈశ్వర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.