కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: బాలుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: హరి స్థలం: కామారెడ్డి

కామారెడ్డి ఇంటర్నేషనల్ హోటల్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఎలక్ట్రిక్ స్కూటీపై వెళ్తున్న హేమంత్(15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడు లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.