నందిగామ యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక: నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎంపిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నల్లబెల్లి
నల్లబెల్లి మండలం నందిగామ గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్ ఆధ్వర్యంలో ఈ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా పొరిక అనిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నవీన్, ప్రధాన కార్యదర్శిగా రాకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నూతన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.