వేలాడుతున్న డిష్ వైర్లు చుట్టుకుని యువకుడికి తప్పిన ప్రమాదం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో గణపతి నిమజ్జనం ముగించుకుని ట్రాక్టర్‌పై వస్తున్న యువకుడి మెడకు విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. ఈ ప్రమాదం నుంచి అతను తృటిలో సురక్షితంగా బయటపడ్డాడు. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను అస్తవ్యస్తంగా వదిలేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.