మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీమ్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కేరళ

కాంతపురంతో భేటీకి ముందు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీమ్ స్పందించారు. మహిళల గురించి కాంతపురం చేసిన అన్ని వ్యాలతో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు. మలేషియాలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని, యూనివర్సిటీల్లోనూ వారే అధికంగా ఉన్నారని తెలిపారు. సంప్రదాయ ఇస్లామిక్ పండితుడైన ఆయన మహిళల కోసం కాలేజీ కూడా నడుపుతున్నారని, అయితే మహిళలు ఇంట్లోనే ఉండాలన్న వ్యాఖ్యలతో తనకు విభేదాలు ఉన్నాయని వెల్లడించారు.