ఉత్తరప్రదేశ్లో మాఫియాను అంతం చేసినట్లు అమిత్ షా ప్రకటన

రిపోర్టర్: శివ స్థలం: Noida

ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం మాఫియాను పూర్తిగా అంతం చేసిందని, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నోయిడాలో జరిగిన యూపీ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. 2017కి ముందు రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలేదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతిభద్రతలు మెరుగయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పారిశ్రామిక కేంద్రంగా మారుతోందని అమిత్ షా వెల్లడించారు.