మార్కెట్లోకి కొత్త హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హైదరాబాద్

ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ ఇండియా తన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా క్యూసీ3 ను రూ.1.35 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. కుటుంబ అవసరాల కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చగా, పూర్తి ఛార్జ్పై 145 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.