ఎల్ నినో సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఒక ఉన్నత స్థాయి సమీక్షలో స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో అనుసరించిన వ్యూహాన్ని పోలిన తరహాలో ఒక పటిష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తాగు, సాగునీటితో పాటు విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి ఒక్కరిని ఈ కార్యాచరణలో భాగస్వామ్యం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.