ఆర్నాల్డ్ తో నా పోటీ చావు పుట్టుకల లాంటిదన్న సిల్వెస్టర్ స్టాలిన్

రిపోర్టర్: శివ స్థలం: World

హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరోలు సిల్వెస్టర్ స్టాలిన్, ఆర్నాల్డ్ శ్వాసనెగర్ మధ్య గతంలో తీవ్రమైన పోటీ ఉండేదని స్టాలిన్ వెల్లడించారు. ఎనిమిదో దశకంలో అప్పట్లో తమ మధ్య జరిగిన వైరం ప్రాణాపాయ పోరాటంలా సాగిందని, ఒకరినొకరు అసహ్యించుకునే స్థాయికి వెళ్లిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే ఈ ఆరోగ్యకరమైన పోటీయే తమను మరింత మెరుగుపరుచుకునేలా చేసిందని, ఒకరికొకరు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.