అమెరికా వాణిజ్య ఒప్పందాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన: భారత్ తో ఇంటర్మ్ డీల్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: వాషింగ్టన్

భారత్ తో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని తమ రెండో విడత పదవీకాలంలో నెరవేర్చిన ప్రధాన హామీల్ లో ఒకటిగా అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనా కాలంలో ప్రపంచ దేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు సాధించినట్లు వైట్ హౌస్ విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ఒప్పందం అమలు కానున్నట్లు ఇరు దేశాలు వెల్లడించాయి.