భయపడేకంటే చావే మేలు: గ్యాంగ్‌స్టర్ బెదిరింపులపై సంచలన జడ్జి వ్యాఖ్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో భార్యను సజీవ దహనం చేసిన కేసులో దోషికి మరణశిక్ష విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ సంచలన తీర్పునిచ్చారు. గ్యాంగ్‌స్టర్ల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, పిరికిపందలా బతికేకంటే చావడమే మేలని ఆయన తీర్పులో పేర్కొన్నారు. జ్ఞానవాపి కేసు విచారణ సమయంలోనూ తనకు ప్రాణభయం ఉండేదని గుర్తుచేశారు.