మందుల తయారీ ధరలకు ఎంఆర్‌పీకి మధ్య తేడాపై సుప్రీంకోర్టు ఆందోళన

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

మందుల తయారీ ధరలకు, రిటైల్ మార్కెట్‌లోని ఎంఆర్‌పీ ధరలకు మధ్య ఉన్న విపరీతమైన తేడాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్యాన్సర్ మందు తయారీ ధర రూ. 2700 ఉంటే ఎంఆర్‌పీ రూ. 27 వేలు ఉండటంపై జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. ఇది పేషెంట్లను దోచుకోవడమేనని మండిపడుతూ, ఈ పిటిషన్ విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.