నిరుద్యోగులకు భారీ ఊరట: డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఏడు వందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల పదకొండు నుంచి ముప్ పై వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. డిసెంబరు ఇరవై నుంచి జనవరి పదమూడు వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఉత్సాహం నెలకొంది.