రాఘవ లారెన్స్ మహావీర్ కర్ణ సినిమా నుంచి ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్, దర్శకుడు రమేశ్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పెన్ మూవీస్, ఆర్‌వి స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.