కడపగండి తండాలో ఘనంగా మహా అన్నదాన ప్రసాద వితరణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సంస్థాన్ నారాయణపూర్
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కడపగండి తండాలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కరంటోతు గోవర్ధన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరంటోతు బిచ్య నాయక్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.