న్యూజిలాండ్ పై విజయంపై స్పందించిన భారత యువ పేసర్ అన్షుల్ కాంబోజ్
రిపోర్టర్: శివ
స్థలం: Auckland
న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో విజయం సాధించడంపై భారత యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ తాజాగా స్పందించారు. ఈడెన్ పార్క్ మైదానంలో బౌలింగ్ కు అనుకూలమైన పరిస్థితులకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవడంపై ఆయన మాట్లాడారు. తన అరంగేట్రంలో ఎదురైన ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఆల్ రౌండర్‌గా తన పాత్రపై దృష్టి పెట్టడంతో పాటు సరైన ప్రక్రియను అనుసరించడం ఎంతో కీలకమని అన్షుల్ కాంబోజ్ స్పష్టం చేశారు.