భారతరత్నతో డాక్టర్ మన్మోహన్ సింగ్ ను సత్కరించాలన్న రేవంత్ రెడ్డి
రిపోర్టర్: హరి
స్థలం: వికారాబాద్
భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం అందించి సత్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వికారాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మారక పార్కు ప్రారంభోత్సవ వేదికగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. నూతన భారతదేశానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడి సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, ఆయన మార్గదర్శకత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.