కేరళ తీర ప్రాంతాల్లో అత్యంత భారీ అలల హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: కేరళ
కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు ఇన్కోయిస్ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు.