పూర్తయిన ఆత్రేయపురం బ్రదర్స్ షూటింగ్: త్వరలో ప్రేక్షకుల ముందుకు
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ 'ఆత్రేయపురం బ్రదర్స్' షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని S2S సినిమాస్, ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.