ఏపీలో అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
బంగాళಾఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ డిపోలోకి వర్షపు నీరు చేరింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.