ఇచ్చోడలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ దూసుకెళ్లి ముప్ పై గొర్రెలు మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఇచ్చోడ

ఇచ్చోడ మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్పైకి పైగా గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు మరియు పోలీసులు వెల్లడించారు. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదం అనంతరం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొన్ని గొర్రెలను కొందరు స్థానికులు తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.