పుంగనూరు మున్సిపల్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు

రిపోర్టర్: నరేష్ స్థలం: పుంగనూరు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అధికార పార్టీ దౌర్జన్యాలు, నామినేషన్ల అడ్డుగింపు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ప్రాణాలకు రక్షణ లేని చోట ఎన్నికల్లో పోటీ చేయడం అర్థరహితమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. ఈ అరాచకాలపై త్వరలో గవర్నర్ను కలుస్తామని తెలిపారు.