రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు
రిపోర్టర్: వెంకట్
స్థలం: బాపట్ల
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు గొట్టిపాటి రవి కుమార్ - విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే తెలిపారు. ఈ వేదికగా రూ.11,085 కోట్ల భారీ విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.