రాజంపేట పురపాలక సంఘం ఛైర్పర్సన్గా డాక్టర్ దొంతం గాయత్రి ఎన్నిక
రిపోర్టర్: విజయ్
స్థలం: అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా రాజంపేట పురపాలక సంఘం ఛైర్పర్సన్గా ఇరవై నాలుగు ఏళ్ల డాక్టర్ దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఛైర్పర్సన్గా ఆమె రికార్డు సృష్టించారు. తండ్రి రాజకీయ వారసత్వంతో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, వైద్య విద్యను పూర్తి చేసిన వెంటనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. పట్టణంలోని పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని నూతన ఛైర్పర్సన్ గాయత్రి స్పష్టం చేశారు.