షాకింగ్ ఘటన: స్కైడైవింగ్లో పారాచూట్లు ఢీకొని ఇద్దరు దుర్మరణం

రిపోర్టర్: సురేష్ స్థలం: California

అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఇద్దరు అనుభవజ్ఞులైన స్కైడైవర్లు ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గాల్లో ఎగురుతున్న సమయంలో పారాచూట్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని, తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని నిర్ధారించారు. పరికరాల్లో ఎలాంటి లోపం లేదని నిర్వాహకులు తెలిపారు.