శ్రీకాకుళం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని రైతు సంఘాల డిమాండ్
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, రబీ సీజన్కు ప్రత్యామ్నాయ స్వల్పకాలిక విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మాకనపల్లి గ్రామ సచివాలయ అధికారికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచి, రోజువారీ కూలి రూ.600 ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెప్పల అజయ్ కుమార్, సాలిన వీరస్వామి, కోరాడ లింగమూర్తి, బత్తిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.