వివాహ రద్దు కేసుల విచారణపై జమ్ము హైకోర్టు కీలక తీర్పు
రిపోర్టర్: విజయ్
స్థలం: Jammu
భార్యపై వేధింపుల ఆరోపణలు ఉన్నప్పుడు ఆమె నివసించే ప్రాంతంలోని కోర్టులో కూడా విడాకుల పిటిషన్ విచారించే అధికారం ఉంటుందని జమ్ముకశ్మీర్ లడఖ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక దశలో ఆరోపణల నిజానిజాలను నిర్ధారించలేమని జస్టిస్ సంజయ్ ధర్ తేల్చిచెప్పారు. వివాహం ఎక్కడ జరిగినా వేధింపుల ఘటనలు జరిగిన ప్రాంతంలోనూ విచారణ జరపవచ్చని న్యాయస్థానం వెల్లడించింది.