ట్రాఫింగ్‌పై వస్తున్న ట్రోల్స్‌కు ధీటుగా బదులిచ్చిన ఆకాంక్ష చమోలా

రిపోర్టర్: అశోక్ స్థలం: India

తాజాగా తాను పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూపై వస్తున్న నెగెటివ్ ట్రోల్స్‌కు నటి ఆకాంక్ష చమోలా గట్టిగా బదులిచ్చారు. ఆ వీడియోలో తాను మాట్లాడిన మాటలు కేవలం ట్రోల్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్‌లో భాగంగానే అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్లు, ఉపయోగించే భాష ఎంత బాధాకరంగా ఉంటాయో ప్రజలకు తెలియజేయడానికే తాము ఆ పాత్రలను పోషించి రీక్రియేట్ చేశామని తెలిపారు. పూర్తి వీడియో చూడకుండా కేవలం చిన్న క్లిప్‌లను కట్ చేసి కొందరు విమర్శలు చేస్తున్నారని ఆకాంక్ష మండిపడ్డారు.