దేశంలో జనగణన షెడ్యూల్ విడుదల: 2027 జనవరి 25 నుంచి ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృతుంజయ్ కుమార్ నారాయణ్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. 95 ఏండ్ల తర్వాత తొలిసారిగా కులాల వారీగా జనాభాను లెక్కించనున్నారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర కేబినెట్ రూ.11,718 కోట్లను ఆమోదించింది.