కళ్యాణదుర్గంలో వర్షాభావం.. ఎండిపోయిన వేరుశనగ పంటలు

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా

కళ్యాణదుర్గం ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. నైరుతి రుతుపవనాలు విఫలం కావడంతో వేలాది ఎకరాల్లో వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావులు సైతం వట్టిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతుండగా, పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి.