'నాలుగు చోరీ కేసులు ఛేదించాం': 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్న కర్నూలు పోలీసులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Kurnool

కర్నూలు జిల్లాలో పోలీసులు ప్రతిభ చాటారు. నాలుగు చోరీ కేసులను విజయవంతంగా ఛేదించిన కర్నూలు పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలను అరెస్ట్ చేసి ఆమె నుంచి ముప్పై తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోించిన పోలీసు సిబ్బందిని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.